బోధన్: సమ్మెలో భాగంగా కార్మికుల వంట వార్పు

71చూసినవారు
బోధన్ పట్టణంలో ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద హమాలి కార్మికులు చేపడుతున్న నిరవధిక సమ్మె నేటితో 5వరోజుకు చేరింది. సమ్మెలో భాగంగా ఆదివారం హమాలి కార్మికులు వంట వార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెను మరింత తీవ్రతరం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వెంకటేష్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్