బోధన్ నియోజకవర్గం సిద్దాపూర్ శివారులో గల క్వారీ నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను బుధవారం గ్రామస్థులు అడ్డుకున్నారు. ట్రాక్టర్ల రాకపోకలతో తమ పొలాలకు వేసిన నీటి పైపులు పగిలిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. దీంతో విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ వికాస్ మహతో, తహశీల్దార్ విఠల్ తో కలిసి గ్రామస్థులతో మాట్లాడారు. బిల్లులు పరిశీలించిన అనంతరం ట్రాక్టర్లను విడిచి పెట్టారు.