ప్రతి రోజు గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, శిశువులకు పౌష్టిక ఆహారం అందించాలని జుక్కల్ ఎమ్యెల్యే తోట లక్ష్మీకాంత రావు అన్నారు. మంగళవారం బిచ్కుంద, మహ్మద్ నగర్ మండల కేంద్రాల్లో జరిగిన పోషణ్ అభియాన్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ పౌష్టిక ఆహారం లోపం వల్ల రక్త హీనత, జనన బరువు తగ్గుదల మొదలగు ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయన్నారు.