గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల అభివృద్ధి అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, మండల పంచాయతీ అధికారులతో గ్రామ పంచాయతీ అభివృద్ది ప్రణాళిక, గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా ప్రచురణ, పారిశుద్ధ్యం, ఇంటి పన్నుల వసూళ్లు, తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. గ్రామాభ్యుదయానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు.