భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన రామొళ్ళ బాబు(30) రెండు సంవత్సరాలుగా మద్యానికి బానిస అయ్యాడు. సోమవారం రాత్రి మద్యానికి భార్యను డబ్బులు అడగగా ఆమె నిరాకరించింది. దీనితో రూమ్ లోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నందు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మంగళవారం ఎస్సై తెలిపారు.