ఆగి ఉన్న లారీని ఢీ కొని వ్యక్తి మృతి
పాల్వంచ మండలం భవానిపేటకు చెందిన గంగని రాములు(50) గురువారం ద్విచక్ర వాహనంపై పొలానికి వెళ్తూ రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీ కొట్టాడు. ఈ ఘటనలో రాములు తలకు బలమైన గాయాలు అయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై అనిల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.