జక్రాన్ పల్లి మండలం బ్రాహ్మణపల్లి బ్రిడ్జి వద్ద ఎన్హేచ్ 44 రోడ్డుపైన ఆదిలాబాద్ పట్టణానికి చెందిన బంకలవాడు బాలాజీ (50)ని మంగళవారం గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.