నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను మర్చిపోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కేశవేణు భక్తవత్సలం, ముప్ఫ గంగారెడ్డి, శేఖర్ గౌడ్, మీసాల సుధాకర్ రావు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.