చక్కెర పరిశ్రమను ప్రభుత్వమే తెరిపించి నడిపించాలి - ఏఐకేఎంఎస్

54చూసినవారు
చక్కెర పరిశ్రమను ప్రభుత్వమే తెరిపించి నడిపించాలి - ఏఐకేఎంఎస్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని (ఎన్ ఆర్) భవన్లో మంగళవారం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ జిల్లాలో మూతపడిన చక్కెర పరిశ్రమలను కొత్త ప్రభుత్వం వెంటనే తెరిపించి నడిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయి రెడ్డి, ఉపాధ్యక్షులు, సాయిలు, అగ్గు ఎర్రన్న పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్