యంచ చెక్ పోస్టును పరిశీలించిన అబ్జర్వర్

50చూసినవారు
యంచ చెక్ పోస్టును పరిశీలించిన అబ్జర్వర్
నిజామాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతమైన నవీపేట మండలంలోని యంచ వద్ద కొనసాగుతున్న చెక్ పోస్ట్ ను ఎన్నికల వ్యయ పరిశీలకులు
డీ. ఎం. నెమ్జీ శనివారం తనిఖీ చేశారు. చెక్ పోస్టు వద్ద చేపడుతున్న తనిఖీల తీరును పరిశీలించారు. ఎన్నికల షెడ్యూలు వెలువడిన నాటి నుండి ఇప్పటి వరకు ఎంత మొత్తంలో అక్రమ నగదు, మద్యం నిల్వలు స్వాధీనం చేసుకున్నారని అడిగి తెలుసుకున్నారు. అబ్జర్వర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్