సౌతాఫ్రికా T20 లీగ్‌లో భాగంగా ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచులో పార్ల్ రాయల్స్ జట్టు విజయం సాధించింది. 213 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి టోర్నీ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డుకెక్కింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ చిన్నారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్టాండ్స్‌లో కూర్చొన్న ఆ చిన్నారి తన ఫేవరెట్ టీమ్ పరాజయం చెందడంతో నిరాశతో తల పట్టుకుంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.