AP: ఉమ్మడి ప్రకాశం జిల్లా వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ పార్టీ నేతలతో మాట్లాడుతూ.. 'గ్రామ స్థాయిలో మన పార్టీ చాలా బలంగా ఉంది. మన పార్టీలో ఇప్పటికే క్రియాశీలక మార్పులకు నాంది పలికాం. సంక్రాంతి తర్వాత ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తాను. కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం పేర్లతో కార్యక్రమాలు నిర్వహిస్తాం'. అని జగన్ పేర్కొన్నారు.