ఐపీఎల్ 2025 సీజన్‌కి ముందు లక్నో సూపర్ జెయింట్స్(LSG) కొత్త కెప్టెన్ ఎవరనే అంశంపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సిక్సర్ల వీరుడు నికోలస్ పూరన్‌ను ఎంపిక చేస్తారా, అత్యధిక ధర పెట్టి కొనుగోలు చేసిన పంత్ వైపు మొగ్గు చూపుతారా అనే చర్చ జరుగుతోంది. అయితే, టీమిండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్‌కే ఆ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలిసింది. ఐపీఎల్ 2025లో లక్నోకు అతడే కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం.