ఓ పారాగ్లైడర్ ప్రోగ్రామ్‌కి వచ్చిన చీఫ్ గెస్ట్‌పైనే ల్యాండ్ అయ్యాడు. ఈ ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. ఈవెంట్‌లో పారాగ్లైడర్ తన ప్రతిభను కనబర్చుతున్నాడు. గాలిలో పారాచూట్ సాయంతో రెడ్, బ్లూ పొగను వదులుతూ విన్యాసాలు చేశాడు. మైదానంలో ల్యాండ్ అవ్వాల్సి ఉండగా అదుపుతప్పి ఒక్కసారిగా వేదికపైకి దూసుకొచ్చాడు. దీంతో వేదికపై ఉన్న వారంతా భయపడిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.