ఆస్టిన్‌లో "పేరెంటింగ్ & వెల్-బీయింగ్" సదస్సు – ముఖ్య అతిథిగా సుధీర్ సండ్ర

84చూసినవారు
ఆస్టిన్‌లో "పేరెంటింగ్ & వెల్-బీయింగ్" సదస్సు – ముఖ్య అతిథిగా సుధీర్ సండ్ర
తల్లితండ్రుల మరియు విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచే విశిష్ట కార్యక్రమం "Nourish & Nurture: A HSS Potluck for Parenting & Well-being" పేరుతో ఈ నెల 28న ఆస్టిన్‌లోని లీండర్ పట్టణంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, సైకాలజిస్టు సుధీర్ సండ్ర ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

తేదీ: మార్చి 28, 2025 (శుక్రవారం)
సమయం: రాత్రి 7 గంటలకు
స్థలం: 2932 Sablebrooke Dr, Leander, TX, 78641

ఈ ప్రత్యేక కార్య‌క్ర‌మాన్ని Austin HSS ఆతిథ్యమిస్తోంది. ఇది పిల్లల పెంపకం, పేరెంటింగ్‌ లో ఎదురయ్యే సవాళ్ళు, మరియు విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారా తల్లి తండ్రులు తమ నైపుణ్యాలను అభివృద్ధిపరుచుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.

సుధీర్ సండ్ర గురించి:
తెలుగురాష్ట్రాల్లో యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ, వేల మందికి మానసిక స్పష్టతను అందించిన వ్యక్తి. ఆయన ఉపన్యాసాలు విద్యార్థులు, తల్లి తండ్రులు, టీచర్లలో విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పుడు అంతర్జాతీయ వేదికలకూ తమ సందేశాన్ని తీసుకెళ్తున్నారు.

రిజిస్ట్రేషన్ కోసం:
ఈ కార్య‌క్ర‌మానికి హాజరు కావాలనుకునే వారు ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు – https://evite.me/VnFNhSRA8e

చివరగా:
ఇది కేవలం ఒక గెట్ టుగెదర్ కాదు, పేరెంటింగ్‌ను నూతన కోణంలో అర్థం చేసుకునే అవకాశంగా భావించవచ్చు. అమెరికాలోని భారతీయ సమాజానికి ఇది ఓ అరుదైన అవకాశంగా నిలవనుంది.

సంబంధిత పోస్ట్