బాలుడి ప్రాణాలతో పేరెంట్స్ చెలగాటం (వీడియో)

579చూసినవారు
పిల్లలకు చిన్న దెబ్బ తగిలితే పేరెంట్స్ విలవిల్లాడిపోతారు. అయితే ఓ దంపతులు మాత్రం తమ కుమారుడి ప్రాణంతో చెలగాటం ఆడారు. స్కూటర్ ఫుట్ రెస్ట్ స్టాండ్‌పై బాలుడిని పేరెంట్స్ నిలబెట్టారు. అలాగే రద్దీ రోడ్డుపై స్కూటీ రైడ్ చేశారు. ఆ బాలుడు కింద పడితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఆ పేరెంట్స్ తీరుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

సంబంధిత పోస్ట్