హైదరాబాద్‌లో పాస్‌పోర్టు సేవలు బంద్

74చూసినవారు
హైదరాబాద్‌లో పాస్‌పోర్టు సేవలు బంద్
హైదరాబాద్ నగరంలోని పాస్‌పోర్టు కేంద్రాల్లో సేవలు నిలిచిపోయాయి. ఐదు రోజులుగా ఇదే సమస్య తలెత్తుతుంది. బేగంపేట, అమీర్‌పేట, టోలిచౌకిల్లో పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో స్లాట్ బుకింగ్‌ను అధికారులు నిలిపివేశారు. దీంతో నగరవాసులు పాస్‌పోర్టుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి ఫిర్యాదులు పంపుతున్నా స్పందించే వారు లేరని పలవురు దరఖాస్తుదారులు వాపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్