బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ బెదిరింపులపై తాజాగా సల్మాన్ ఖాన్ స్పందించారు. రంజాన్ పండుగ నేపథ్యంలో తాను నటించిన ‘సికిందర్’ మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన.. తన చావు దేవుడి చేతుల్లో ఉందన్నారు. ఎంత కాలం బతకాలని రాసుంటే అంతకాలం బతుకుతానని పేర్కొన్నారు.