పాలకుర్తి: కేంద్ర ప్రభుత్వ పథకాలపై మహిళలకు అవగాహన

63చూసినవారు
పాలకుర్తి: కేంద్ర ప్రభుత్వ పథకాలపై మహిళలకు అవగాహన
పాలకుర్తి ఎంపీడీఓ ఆఫీస్ లో సోమవారం జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాల్ ఆధ్వర్యంలో మహిళా సాధికారత సమావేశం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో కేంద్ర కోఆర్డినేటర్ దయ అరుణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ శక్తి పథకం గురించి వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బాలికల రక్షణ, విద్య, లింగ నిర్ధారణ, బేటీ బచావో- బేటీ పడావో వంటి ముఖ్య అంశాలకు సంబంధించి అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్