రామగుండం రైల్వేస్టేషన్ ఏరియాలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఆదివారం శ్రీ దత్త సాయి జయంతోత్సవ వేడుకల సందర్భంగా మహా క్షీరాభిషేకం, పుష్పాభిషేకం చేశారు. మందిర ఛైర్మన్, కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ పర్యవేక్షణలో వేద పండితులు రాంపల్లి మురళీధర శర్మ మంత్రోచ్ఛరణల మధ్య ఘనంగా నిర్వహించారు.