తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మొదట్లో ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నారని.. రాయలసీమ రైతులకు నీళ్ల కోసం సహకరిస్తా అని తెలిపారు. కానీ, కేసీఆర్ ఇప్పటి వ్యవహార శైలీ తనకు నచ్చడం లేదని విమర్శించారు. అయితే, దాని గురించి మాట్లాడటం నాకు ఇష్టంలేదన్న పెద్దిరెడ్డి.. తమ వాటా మేరకే నీటిని తీసుకుంటామని స్పష్టం చేవారు. సీఎం కేసీఆర్‌తో జరిగిన సమావేశంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా ఉన్నారని.. ఆయనకు అన్నీ విషయాలు తెలిసినప్పటికీ ఎందుకిలాంటి కామెంట్లు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.