ఈ నెల చివరి వారంలో 'పీఎం కిసాన్‌' డబ్బులు

81చూసినవారు
ఈ నెల చివరి వారంలో 'పీఎం కిసాన్‌' డబ్బులు
పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి 19వ విడత నగదు సాయం కోసం దేశ వ్యాప్తంగా రైతులంతా ఎదురుచూస్తున్నారు. వీరికి ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుభవార్త చెప్పారు. ఫిబ్రవరి చివరి వారంలో రైతులందరి ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు పడతాయని తెలిపారు. ఇక ఈ స్కీం ప్రయోజనం పొందాలంటే రైతులు తప్పనిసరిగా e-KYC ప్రక్రియను పూర్తి చేసుకొని ఉండాలి. లేనియెడల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావు.

సంబంధిత పోస్ట్