తన రికార్డును తానే బ్రేక్ చేసిన ప్రధాని

83చూసినవారు
తన రికార్డును తానే బ్రేక్ చేసిన ప్రధాని
దేశం ఇవాళ ఆగస్ట్ 15 పురస్కరించుకుని 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాల నిడివిలో ప్రధాని మోదీ తన రికార్డును తానే బద్దలుకొట్టారు. 2016లో 96 నిమిషాల పాటు ప్రసంగించగా నేడు 98 నిమిషాలతో దాన్ని దాటేశారు. ప్రధానిగా ఆయన స్పీచ్‌ల సగటు 82 నిమిషాలుగా ఉంది. మరే ప్రధానికి ఈ సగటు లేదు. అత్యల్పంగా 2017లో 56 నిమిషాల పాటు మాట్లాడారు. గత ఏడాది 90 మినిట్స్ ప్రసంగించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్