తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేయని సీఎం రేవంత్ ఢిల్లీలో కొత్త నాటకం మొదలెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆయన వ్యవహారం తల్లికి బువ్వ పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు ఉందని Xలో ట్వీట్ చేశారు. 'ఉచిత కరెంట్, గ్యాస్ సబ్సిడీ, నెలకు రూ.2500, తులం బంగారం, రైతు భరోసా ఎవరికి ఇచ్చారు? రూ.5లక్షల విద్యా భరోసా ఎక్కడ? ఇక్కడి హామీలకే దిక్కు లేదు.. ఢిల్లీలో హామీలకు గ్యారంటీ ఇస్తున్నావా?' అని ప్రశ్నించారు.