IPL-2025లో భాగంగా మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. PBKS ఇచ్చిన 244 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో GT విఫలమైంది. GT నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. GT బ్యాటర్లలో సుదర్శన్ (74), బట్లర్ (54) అర్థశతకాలతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ 2 వికెట్లు తీయగా.. జాన్సెన్, మాక్స్‌వెల్ తలో ఒక వికెట్ తీశారు.