ఫైనల్ చేరిన పీవీ సింధు

61చూసినవారు
ఫైనల్ చేరిన పీవీ సింధు
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మలేసియా ఓపెన్ -2024లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన క్రీడాకారిణి బుసానన్ ఒంగ్‌బమ్రుంగ్‌ఫాన్‌పై ఘన విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక ఫైనల్‌లో చైనా క్రీడాకారిణి వాంగ్ జీ యితో తలపడనుంది. ప్యారిస్ ఒలింపిక్స్‌లో పతకం గెలవాలని సింధూ పట్టుదలగా ఉంది. ప్రస్తుతం ప్రపంచ 15వ ర్యాంకర్‌గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్