ఎన్టీఆర్‌తో పోటీకి దిగిన రజనీకాంత్‌

74చూసినవారు
ఎన్టీఆర్‌తో పోటీకి దిగిన రజనీకాంత్‌
అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ నటించిన ‘వేట్టయాన్‌’ దసరా కానుకగా అక్టోబర్‌ 10న విడుదల కానుంది. రజనీకాంత్‌ ఈ అప్‌డేట్‌ ఇచ్చిన దగ్గర నుంచి సోషల్‌ మీడియాలో ‘దేవర’ వర్సెస్‌ ‘వేట్టయాన్‌’ చర్చ మొదలైంది. ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’ మొదటి భాగంను అక్టోబర్‌ 10న చేయనున్నారు. ఈ చిత్రం తమిళంలోనూ రిలీజ్‌ కానుంది. దీంతో ఆ తేదీన బాక్సాఫీస్‌ వద్ద పోరు ఖాయం.

సంబంధిత పోస్ట్