గేమ్ ఛేంజర్ విడుదల తర్వాత రామ్ చరణ్కు విషెస్ తెలిపేందుకు HYDలోని నివాసానికి ఇవాళ పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ చేరుకున్నారు. వారందరికీ చెర్రీ మధ్యాహ్నం భోజనాలను ఏర్పాటుచేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. చరణ్ మంచి మనసుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆయన కెరీర్లో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.