శుక్రవారం సాయంత్రం వినాయక నగర్ కాలనీ, హయత్ నగర్ లోని, స్టీల్ ట్రేడర్స్ షాప్ ముందు ఒక గుర్తుతెలియని మగ వ్యక్తి మృతి చెందాడు.
అతని వయసు సుమారు 55 సంవత్సరాలు కలిగి, తెలుపు బనియన్ మరియు బ్లూ నిక్కర్ ధరించి, అపస్మారక స్థితిలో పడి ఉండగా గమనించిన స్థానికులు అంబులెన్స్ పిలిపించి చెక్ చేయించగా అతను అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. యాజమాన్యం ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.