ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ అరెస్ట్
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్ర ఉద్రిక్తతల మధ్య గాంధీ ఆయన అనుచరులను తరలిస్తున్నారు. కౌశిక్ రెడ్డి సవాల్ నేపథ్యంలో కొండాపూర్ లోని ఆయన ఇంటికి అనుచరులతో కలిసి గాంధీ వెళ్లారు. దీంతో కౌశిక్ ఇంట్లోకి దూసుకెళ్లడంతో పాటు రాళ్లు, టమాటాలు, కోడిగుడ్లు విసరడంతో పరిస్థితి అదుపు తప్పింది.