ఆమనగల్లు: కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు విడనాడాలి

78చూసినవారు
ఆమనగల్లు: కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు విడనాడాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు విడనాడాలని సీపీఎమ్ జిల్లా కార్యదర్శి భాస్కర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆమనగల్లులో సీపీఎమ్ ఏరియా మహాసభ నిర్వహించారు. సభలో నాయకులకు నివాళులర్పించి జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నిక అంటూ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలులో విఫలమైందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్