తలకొండపల్లి: పోరాటాల ద్వారానే మండలం ఏర్పాటు సాధ్యం

72చూసినవారు
తలకొండపల్లి: పోరాటాల ద్వారానే మండలం ఏర్పాటు సాధ్యం
పోరాటాల ద్వారానే మండలం ఏర్పాటు సాధ్యమని జేఏసీ కార్యదర్శి యాదగిరి చెప్పారు. తలకొండపల్లి మండలం గట్టు ఇప్పలపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని చేస్తున్న రిలే నిరాహార దీక్షలు బుధవారం కొనసాగాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తేనే మండల కేంద్రం ఏర్పాటు సాధ్యమవుతుందన్నారు. మండలం ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్