ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుండి స్వీకరించిన ఫిర్యాదులను పెండింగ్ లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయా భవనంలోని సమావేశమ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా తమ సమస్యలు తెలపడానికి వచ్చిన ప్రజల వద్ద నుంచి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీతలతో కలిసి దరఖాస్తులను స్వీకరించారు.