దళితులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి
దళితులకు అన్ని ప్రభుత్వ పథకాలు వర్తింప చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. స్వాతంత్ర ఆయన మాట్లాడుతూ స్వాతంత్రానికి ముందు జరిగిన పూణే ఒప్పందంపై నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, నాయకులు పాల్గొన్నారు.