తెలంగాణలో మళ్లీ లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్‌ను అమల్లోకి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మీడియాకు ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో విధివిధానాలు ఖరారు కోసం శుక్రవారం మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.