ఫరూక్ నగర్ మండలంలోని మేళ్లబాయి తండాలో ఆదివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో జరుగుతున్న విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి పాల్గొన్నారు. విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డిని తండావాసులు సాదరంగా ఆహ్వానించి, ఆయనను సత్కరించారు.