భర్త చనిపోతే సతీ సహగమనం లాంటి రోజులున్న తరుణంలో మహిళలను స్వశక్తితో చదువుకునే విధంగా స్వేచ్ఛను ప్రసాదించే ప్రయత్నం చేసిన ధీరవనిత సావిత్రిబాయి పూలే అని షాద్ నగర్ బీఆర్ఎస్ యువ నాయకులు నందారం అశోక్ యాదవ్ అన్నారు. శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా చటాన్ పల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగిన సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమానికి అశోక్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.