విద్యార్థి ఉద్యమాల పోరాటాల వేగుచుక్క ఎస్ఎఫ్ఐ అని రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ అన్నారు. మంగళవారం షాద్‌నగర్ మున్సిపాలిటీ కేంద్రంలో ఎస్ఎఫ్ఐ 55వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాంత్ హాజరై స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం అనే నినాదంతో ఉన్న జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1970లో డిసెంబర్ నెలలో ఎస్ఎఫ్ఐ కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రంలో ఏర్పడిందన్నారు.