షాద్ నగర్ లో నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన కార్యక్రమాలకు పోలీసులు ఆంక్షలు విధించారు. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ నూతన సంవత్సరానికి సంబంధించి ముఖ్యమైన సూచనలను మంగళవారం స్థానిక మీడియాకు ప్రకటన ద్వారా వెలువరించారు. ఈ సందర్భంగా వారు ప్రకటనలో పేర్కొంటూ డిజే & సౌండ్ బాక్స్ లకు, పెద్ద పెద్ద శబ్దాలకు ఎలాంటి అనుమతులు లేవనీ ప్రత్యేకమైన నిఘా వుంటుందని తెలిపారు.