గ్రామాల్లో ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరు అలవర్చుకొని సుఖశాంతులతో వర్ధిల్లాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కోరారు. ఆదివారం ఫరూక్ నగర్ మండలం కిషన్ నగర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయం నవగ్రహ ఆంజనేయస్వామి విగ్రహం ధ్వజస్తంభం ప్రతిష్టా కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు అనంతరం వేద పండితుల సమక్షంలో ఎమ్మెల్యే శంకర్ ను వేద మంత్రాలతో దీవించారు.