షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం దేవునిపల్లి గ్రామంలో సోమవారం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణు గోపాల స్వామి కల్యాణ మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అత్యంత భక్తిశ్రద్ధలతో కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.