12, 13 తేదీల్లో మండలస్థాయి పోటీలు

84చూసినవారు
12, 13 తేదీల్లో మండలస్థాయి పోటీలు
గండీడ్ మండలంలో మండల స్థాయి క్రీడా పోటీలు ఈనెల 12, 13 తేదీల్లో నిర్వహించనున్నట్లు మండల ఎసీఎఫ్ కన్వీనర్, పీడీ రాములు తెలిపారు. అండర్-14, అండర్-17 బాల బాలికల కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఈ పోటీలు ఉంటాయన్నారు. మండల పరిధిలోని విద్యార్థులు పాల్గొనాలని సూచించారు.

సంబంధిత పోస్ట్