పరిగి: కిటికీ మీద పడి మూడేళ్ల చిన్నారి మృతి

82చూసినవారు
పరిగి: కిటికీ మీద పడి మూడేళ్ల చిన్నారి మృతి
ఇంటి నిర్మాణంలో ఉన్న కిటికీ మీదపడి మూడేళ్ల చిన్నారి మృతి చెందిన విషాదకర ఘటన వికారాబాద్ జిల్లా పరిగిలో చోటుచేసుకుంది. బ్రాహ్మణపల్లి పెద్ద తండాలో ఈ దుర్ఘటన జరిగింది. కూతురు సోనా(3) మృతితో తల్లిదండ్రులు శాంతి, హనుమంతు కన్నీరుమున్నీరవుతున్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించినా తమ బిడ్డను బతికించుకోలేకపోయాయని వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్