మూసి నది ప్రక్షాళనకు మాస్టర్ ప్లాన్
అనంతగిరి, కొండల్లో పుట్టి హైదరాబాద్ నగరం నుంచి ప్రవహించే మూసి నది ప్రక్షాళనకు ప్రభుత్వం నడుంబిగించింది. ఓ వైపు ఆక్రమణల తొలగింపుతో పాటు మరోవైపు సుందరీకరణలో భాగంగా మూసికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తోంది. మూసి రివర్ ప్లాంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధ్వర్యంలో అధికారులు మాస్టర్ ప్లాన్ ప్రక్రియను ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ కన్సల్టెన్సిని నియమించారు.