కాంగ్రెస్ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి మృతి
తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేనారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ మృతి చెందారు. ఇంద్రసేనారెడ్డి యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, ఆయన మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంతాపం ప్రకటించారు.