తాను హీరోగా నటించిన 'దేవర' మూవీ ప్రమోషన్ల కోసం ఎన్టీఆర్ జపాన్ వెళ్లారు. అక్కడి విమానాశ్రయంలో జపనీయులు ఆయనకు గ్రాండ్గా వెల్కమ్ పలికారు. ఆయన ఆటోగ్రాఫ్ తీసుకుంటూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నెల 28న అక్కడి థియేటర్లలో 'దేవర' మూవీ రిలీజ్ కానుంది.