ఆదాయపు పన్ను విభాగం అధికారులకు ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం కొత్త అధికారాలు రానున్నాయి. ఇకపై వ్యక్తుల సోషల్‌మీడియా ఖాతాలు, ఇ-మెయిల్స్, ఆన్‌లైన్‌లో చేసిన పెట్టుబడులు, ట్రేడింగ్ అకౌంట్ల వివరాలను సైతం వారు కోరవచ్చు. పన్ను ఎగవేతకు పాల్పడడం లేదా ఆదాయానికి మించి ఆస్తులు, నగదు, బంగారం కలిగి ఉన్నట్లు గుర్తిస్తే మీ ఖాతాలన్నింటినీ వారు తనిఖీ చేయొచ్చు. డిజిటల్ యుగానికి తగ్గట్టు ఈ నిబంధనలు రూపొందించడం గమనార్హం.