వైవిధ్యమైన కథాంశాలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పట్టకడతారు. తమదీ అలాంటి సినిమానే అంటున్నారు 'టుక్ టుక్' మేకర్స్. హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, శాన్వీమేఘన ప్రధానపాత్రల్లో సుప్రీత్ కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘టుక్ టుక్’. మార్చి 21వ తేదీని ఈ సినిమా థియేటర్లలో విడుదలకానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా మూవీ టీజర్ విడుదల చేశారు.