పీజీ వంటి ఉన్నత వైద్య విద్య కోర్సుల రిజర్వేషన్ల విషయంలో నివాస ప్రాంతాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ‘మనకు దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు ఉంది. దేశంలోని ఏ విద్యాసంస్థలోనైనా చదువుకునే హక్కును రాజ్యాంగం ప్రసాదించింది. ఉద్యోగం, వ్యాపారం చేసుకోవడానికి దేశంలో ఎక్కడైనా ఉండే హక్కు ఉంది. అలాగే చదువుకునే హక్కు కూడా’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.