గుట్కాను బ్యాన్ చేసిన రేవంత్ ప్రభుత్వం

57చూసినవారు
గుట్కాను బ్యాన్ చేసిన రేవంత్ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా గుట్కాను బ్యాన్ చేసింది. తెలంగాణలో గుట్కా తయారీ, అమ్మకంను బ్యాన్ చేసింది. ఈ మేరకు గుట్కాపై నిషేధం విధిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పొగాకుతో పాటూ నికోటిన్ ఉత్ప‌త్తుల‌ను అమ్మ‌డంతో పాటూ స్టోర్ చేయ‌డం కూడా నేరంగా పరిగ‌ణించ‌నున్నారు. మే 24, 2024 సంవ‌త్స‌రం నుంచి ఏడాది పాటూ నిషేదం అమ‌ల్లో ఉంటుంది.

సంబంధిత పోస్ట్